ఐపీఎల్ -2025లో భాగంగా చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను రాజస్థాన్ రాయల్స్ ఓడించింది. టాస్ ఓడి తొలు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్య ఛేదన పంజాబ్ కింగ్స్ విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.
జైస్వాల్ 45 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. వ్యక్తిగత స్కోర్ 67 వద్దకు చేరిన తర్వాత ఫెర్గీసన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ సంజు శాంసన్ 26 బంతుల్లో 38 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 25 43 పరుగులు (నాటౌట్) చేయడంతో రాజస్థాన్ 200 మార్క్ ను దాటింది. నితీశ్ రాణా (12), హెట్మెయిర్( 20) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.
పంజాబ్ బౌలర్లలో ఫెర్గీసన్ రెండు వికెట్లు తీయగా మార్క్ జాన్సన్, అర్షదీప్ సింగ్ చెరొక వికెట్ తీశారు.
లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కేవలం ఒక్క బంతినే ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ కూడా రాణించలేకపోయాడు. కేవలం 16 బంతులు ఎదుర్కొని 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శ్రేయస్ అయ్యర్ (10) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. మార్కస్ స్టొయిన్సన్ (1) నిరాశపరిచాడు. నేహల్ వధేరా 41 బంతుల్లో 62 పరుగులు, గ్లెన్ మ్యాక్స్ వెల్ 21 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. శశాంక్ సింగ్ పది పరుగులతో నాటౌట్ గా నిలవగా, సూర్యాంశ్, మాక్రో జాన్సన్, అర్షదీప్, ఫెర్గీసన్ విఫలమయ్యారు.
రాజస్థాన్ బౌలర్లలో అర్చర్ 3, సందీప్ శర్మ, మహీష్ తీక్షణ చెరో రెండు వికెట్లు, హసరంగ, కుమార కార్తీకేయ చెరొక వికెట్ తీశారు.
ఐపీఎల్‌లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.