కరీంనగర్‌లో తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి సహకరించాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడుకు లేఖ రాసారు.
కరీంనగర్‌లో టీటీడీ ఆలయానికి 2023లోనే అనుమతి మంజూరయిందని బండి సంజయ్ చెప్పారు. 2023 మే 31న కరీంనగర్‌లో పదెకరాల స్థలంలో శంకుస్థాపన జరిగిందని, అయితే ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఒక్క ఇటుక కూడా కదల్లేదనీ చెప్పారు. ఆలయ నిర్మాణం కోసం గత రెండేళ్ళలో ఒక్క అడుగైనా పడలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
టిటిడి ఆలయ నిర్మాణం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారనీ, వీలైనంత త్వరగా ఆ ఆలయాన్ని నిర్మించాలనీ బండి సంజయ్ టీటీడీ ఛైర్మన్‌ను కోరారు.