చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి రంగరాజన్ మీద దాడి కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్ వచ్చింది. ప్రధాన నిందితుడు కె వి రెడ్డికి రాజేంద్ర నగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
రంగరాజన్ మీద దాడి చేసిన ఘటనలో నిందితుణ్ణి మొయినాబాద్ పోలీసులు ఫిబ్రవరి 8న అరెస్ట్ చేసారు. 2025 ఫిబ్రవరి 7న సుమారు 25మంది నిందితులు రంగరాజన్ ఇంట్లోకి చొరబడ్డారు. రామరాజ్యం కోసం సైన్యం ఏర్పాటు చేస్తున్నామనీ, తమకు ఆర్థిక సహాయం కావాలంటూ కె వీరరాఘవ రెడ్డి, పాతికమంది అనుచరులతో వచ్చి దాడి చేసారు.