మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 86 మంది మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల వద్ద లొంగిపోయారు. పోలీసు బెటాలియన్ కార్యాలయంలో కొత్తగూడెం మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన వారని ఐజీ తెలిపారు.
ఆపరేషన్ చేయూత కార్యక్రమం కింద మావోయిస్టులు లొంగిపోయినట్లు ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. లొంగిపోయిన వారిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందజేయనుంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదు