పేదరికం లేని సమాజం తీసుకురావడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఇవాళ ఆయన పర్యటించారు. పీ 4లో భాగంగా బంగారు కుటుంబాలతో ఆయన మమేకం అయ్యారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. 30 సంవత్సరాల ముందు చూపుతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. బాబుజగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
తలసరి ఆదాయం పెంచడం ద్వారా పేదరికం రూపుమాపాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని అభిప్రాయపడ్డారు. పేదల సేవలో భాగంగానే ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఏపీని అప్పుల కుప్పలా మార్చిందని, తాము సంపద పెంచేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.