కెనడాలో హిందువులు, దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ భారతీయుడిని దారుణంగా పొడిచి చంపారు. శుక్రవారంనాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెనడాలోని ఒట్టావాలోని రాక్‌లాండ్ సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
హత్యకు పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు భారత ఎంబసీ అధికారులు తెలిపారు. బాధితుడి కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అయితే బాధితుడి వివరాలు మాత్రం వారు వెల్లడించలేదు.
గత కొంత కాలంగా ఖలిస్థాన్ ఉగ్రవాదుల మద్దతుదారులు కెనడాలో చెలరేగిపోతున్నారు. హిందూ దేవాలయాలపై రెచ్చగొట్టే రాతలు రాయడం, హిందూ భక్తులపై దాడులకు దిగుతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉండగా, తాజాగా భారతీయుడి హత్య మరోసారి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమనేలా చేశాయి.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదు