ఇండో పసిఫిక్ రక్షణ సన్నాహాల్లో భాగంగా భారత నేవీ దళాలు, అమెరికా రక్షణ దళాలు
టైగర్ ట్రయాంఫ్ 2025 పేరుతో విశాఖ తీరంలో విన్యాసాలు నిర్వహించాయి.
అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్ కంస్టాక్, యూఎస్‌ఎస్ రాల్ఫ్ జాన్సన్ 44 ప్రత్యేకతలను కమాండర్లు బైరాన్ స్టాక్స్, జాన్ సీజర్ వివిధ రంగాల ప్రతినిధులకు వివరించారు. అత్యాధునిక యుద్ధ నౌకల్లో నేవిగేషన్, రాడార్ సిస్టమ్, కెప్టెన్ ఛాంబర్, వసతి, క్యాంటీన్, యుద్ధ విభాగాలపై వివరాలు అందించారు. అమెరికా, భారత్ ప్రతినిధులు పలు అంశాలపై చర్చలు జరిపారు.
కంస్టాక్ నౌక కేవలం యద్ధ సమయంలోనే కాకుండా విపత్తుల సమయంలో ఎలాంటి సహాయం అందిస్తుందో కమాండర్ వివరించారు. నౌకలోని భారీ హోవర్ క్రాఫ్ట్‌లు, యుద్ధ ట్యాంకులు, హెలికాఫ్టర్ల నిర్వహణ పద్దతులను వెల్లడించారు.
నౌకల్లోని అత్యాధునిక యుద్ధ పరికరాల ద్వారా శత్రువులను ఎలా ఎదుర్కోంటారో ఓ నమూనా ద్వారా ప్రదర్శించి చూపించారు. సుదూర లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం ఉన్న లాంచర్‌పై అవగాహన కల్పించారు. అమెరికా నౌకాదళంలో రాల్ఫ్ జాన్సన్ 144కు ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర యుద్ధ నౌకగా గుర్తింపు ఉది, వాయుమార్గం, సముద్ర మార్గం, భూభాగాలపై లక్ష్యాలను కూడా ఈ నౌకల నుంచి క్షిపణుల ద్వారా
ఛేదించగల సామర్ధ్యం ఉంది.
అమెరికా కంస్టాక్ ప్రత్యేకతలు
ఈ యుద్ధ నౌక పొడవు 186 మీటర్లు, దీని బరువు 16,485 టన్నులు. 1990 ఫిబ్రవరి 3న విధుల్లో చేరింది. దీనిలో 400 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. ఇందులో ఓ ఆసుపత్రి కూడా నిర్వహిస్తున్నారు. యుద్ధ ట్యాంకర్లను రవాణా చేయడంతోపాటు, నౌకలో బాంబులతో కూడిన భారీ ట్రక్కులు కూడా ఉన్నాయి.
రాల్ఫ్ జాన్సన్ ప్రత్యేకతలు
దీని పొడవు 155.6మీటర్లు, బరువు 9400 టన్నులు. 2015లో ప్రారంభమైంది. ఇందులో 45 మంది అధికారులుంటారు. ఒకేసారి 96 క్షిపణులను మోసకెళ్లగలదు. సుదూర లక్ష్యాలను ఛేదిస్తుంది. లాంచర్లను కూడా నిర్వహిస్తుంది.
పేదరికం లేని సమాజమే నా లక్ష్యం : సీఎం చంద్రబాబునాయుడు