రెండేళ్లుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గత ఏడాదిలో 35 శాతం, ఈ ఏడాది ఇప్పటికే 20 శాతం పెరిగిన పసిడి ధర రెండు రోజుల్లో రూ.3వేలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒకే రోజు ఔన్సు స్వచ్ఛమైన బంగారం ధర 80 డాలర్లు పతనమైంది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఒకేరోజు రూ.2400పైగా తగ్గింది. తాజాగా 10 గ్రాముల ఫ్యూర్ గోల్డ్ రూ.91000 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ఒకే రోజు రూ.8 వేలు దిగివచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రూ.90000 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయంగా భౌగోళికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో బంగారం, వెండిలో పెట్టుబడులు సురక్షితంగా భావిస్తుంటారు. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్దాలకు నేటికీ ముగింపు లేకపోవడంతో రెండేళ్లుగా పెట్టుబడిదారులు బంగారం, వెండిలో భారీ పెట్టుబడులు పెట్టారు. తాజాగా లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి.
బంగారం (#gold rate ) ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకడంతో ఆభరణాల విక్రయాలు 70శాతంపైగా పడిపోయాయని వర్తకులు చెబుతున్నారు. కేవలం పాత బంగారం మార్పిడి ద్వారా మాత్రమే ఆభరణాలు తీసుకొంటున్నారని వర్తక సంఘాలు చెబుతున్నాయి. బంగారం ధరల్లో మరికొంత కరెక్షన్ తప్పదని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పేదరికం లేని సమాజమే నా లక్ష్యం : సీఎం చంద్రబాబునాయుడు