ఐపీఎల్-2025లో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ముంబయి 5 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసింది. దీంతో లక్నో జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఓపెనర్లు మిచెల్ మార్ష్(60), మార్క్రమ్(53) అర్ధ శతకాలతో రాణించారు. పూరన్ (12), పంత్( 2) నిరాశ పరచగా బదోనీ (30), మిల్లర్( 27) ఫరవాలేదు అనిపించారు. సమద్( 4) ఆకాశ్‌దీప్( 0), శార్దూల్( 5), అవేశ్( 2) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.
ముంబయి బౌలర్లలో పాండ్య 5 వికెట్లు తీయగా విఘ్నేశ్, అశ్వనీ, బౌల్ట్ తలో వికెట్ పడగొట్టారు.
లక్ష్యఛేదనలో ముంబై వెంటవెంటనే రెండు వికెట్లు కొల్పోయింది. జాక్స్, రికల్టన్ తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో విల్ జాక్స్(5) తొలి వికెట్ గా వెనుదిరగగా శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ర్యాన్ రికెల్టన్(10)పెవిలియన్ చేరాడు. నమన్ ధీర్ 24 బంతుల్లో 46 పరుగులు చేసి దిగ్వేష్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 67 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అవేశ్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేసి రిటైర్డ్ హాట్ గా వెనుదిరిగాడు.
ఆఖరి ఓవర్ ను అవేశ్ కట్టుదిట్టంగా వేయడంతో లక్నోకు విజయం దక్కింది. హార్ధిక్ 16 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలిపోయాడు. దీంతో లక్నో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగల్గింది.
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు.