నమాజ్ చేసి బయటకు వస్తున్న సమయంలో కర్రలతో దాడి
వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంపై హర్షం వ్యక్తిం చేసిన ఓ ముస్లిం వృద్ధుడిపై కొందరు దాడి చేశారు. బూతులు తిడుతూ రక్తం కారేలా కొట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా పరిధిలో ఈ సంఘటన జరిగింది.
బీజేపీ మద్దతుదారుడైన జాహిద్ సైఫీ, వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మాఫియా, వక్ఫ్ బోర్డు డబ్బులు తినే వారికే ఈ బిల్లుతో నష్టం జరుగుతుందన్నారు. పేద ముస్లింలకు ఈ బిల్లు ద్వారా మంచి జరుగుతుందన్నారు.
ఆ తర్వాత అబూ బకర్ మసీదులో జాహిద్ సైఫీ నమాజ్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఈ దాడి జరిగింది. ‘నువ్వు ముస్లిం కాదు… హిందువుగా మారావు’ అంటూ కేకలు వేస్తూ కొట్టారు. ఆయనను తిట్టడంతోపాటు కర్రలతో కొట్టి గాయపరిచారు. చెవిపై దెబ్బతగలడంతో వినలేకపోతున్నట్లు తెలిపాడు.
జాహిద్ సైఫీని స్థానికులు పోలీస్ స్టేషన్‌కు తరలించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన రిజ్వాన్, నౌషాద్, షోయబ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలోని మరి కొందరి కోసం వెతుకుతున్నారు.