పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇది పార్లమెంటు పరిధిలో ఉందని, చట్టం చేయాలని పార్లమెంటును కోరాలని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ మహస్ల ధర్మాసనం తీర్పు చెప్పింది.
పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాపై నియంత్రణ విధించేలా ఆదేశించాలంటూ జెఫ్ ఫౌండేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించే సోషల్ మీడియా సంస్థలకు భారీగా జరిమానాలు కూడా విధించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు.
పిటిషనర్లు సంబంధిత విభాగానికి పిటిషన్ పెట్టుకోవచ్చని సుప్రీంకోర్టు కోరింది. ఒకవేళ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసి ఉంటే 8 వారాల్లో పరిష్కరించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.