వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్మోహన్ రెడ్డి ఇంత వరకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదన్నారు. తల్లికి సరస్వతి సిమెంట్ షేర్లు గిఫ్ట్ డీడ్ చేసి, మరలా నాకే కావాలంటూ కోర్టు కెక్కినట్లు గుర్తుచేశారు. మేనకోడలు, మేనల్లుడిని మోసం చేసిన మేనమామగా జనగ్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని షర్మిల ధ్వజమెత్తారు.
తనకు రావాల్సిన ఆస్తుల్లో ఇంత వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదని, తల్లి విజయమ్మకు ఇచ్చిన షేర్లు మరలా తమకే కావాలంటున్నారని షర్మిల ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత ఉందో లేదో వైసీపీ నాయకులే తేల్చుకోవాలని ఆమె హితవు పలికారు.