నేరానికి లక్ష రూపాయలు విలువ కట్టి రూ. 20 వేలు చెల్లింపు
పోక్సో కేసు నమోదు …. పరారీలో నిందితుడు
ఓ దుర్మార్గుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడి ఆ పై కేసు నుంచి తప్పించుకునేందుకు డబ్బు ఎరచూపాడు. విషయం బయటకు పొక్కడంతో కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ఓ కుటుంబం జీవనోపాధి కోసం ఇటీవలే గ్రామానికి వచ్చింది. ఓ రైతు వద్ద పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నారు. ఆ కుటుంబానికి చెందిన 12 ఏళ్ళ బాలిక అడవిలోకి వెళ్ళగా గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన రమేష్ చెరబట్టాడు. ఆ తర్వాత బాలిక శీలానికి వెల కట్టాడు. తప్పుకు అపరాధంగా లక్ష రూపాయలు చెల్లిస్తానని బాలిక తండ్రితో బేరాలాడాడు. రూ. 20వేలు చెల్లించి మిగతావి తర్వాత చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు.
అయితే రమేష్ టీడీపీ కార్యకర్త అని, రాజకీయ అందడండలతో ఈ ఆటవిక చర్యకు పాల్పడ్డాడని స్థానికులు విమర్శిస్తున్నారు. కేసు నమోదు కావడడంతో ఫేస్‌బుక్ ఖాతాలో టీడీపీ నాయకులతో దిగిన ఫొటోలు, బ్యానర్లను రాత్రికి రాత్రే తొలగించాడని చెబుతున్నారు.
విషయం బయటకు పొక్కడంతో కుప్పం పోలీసులు విచారణ చేపట్టారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.