రాజమహేంద్రవరంలో ఘటన
నిందితుడికి రాజకీయనేతల అండదండలు…!
ప్రేమ పేరిట మోసపోయి ఆత్మహత్యాయత్నం చేసిన రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని మృతిచెందింది. బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం ఉదయం ప్రాణాలు విడిచింది.
రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి లో పోస్టుమార్టం నిర్వహించారు.
లైంగిక వేధింపులకు గురైన ఓ ఫార్మా విద్యార్థిని మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్, టీడీపీలో క్రియాశీల నేతగా ఉండటంతో దర్యాప్తు సరిగా జరగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీపక్ ఓ టీడీపీ ఎమ్మెల్యేకు బావమరిది అవుతాడని, మరో నేతకు అల్లుడు అవుతారని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు.
బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో కారణంగా లైంగిక వేధింపుల విషయం బయటకు వచ్చింది.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి రాజమహేంద్రవరం సమీపంలోని ఫార్మసీ కళాశాలలో ఫార్మా-బి ఆఖరి సంవత్సరం చదువుతోంది. నిందితుడు పనిచేసే ఆసుపత్రిలోనే క్లినికల్ ఫార్మసిస్టుగా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. అక్కడ పనిచేసే దీపక్ అనే ఉద్యోగి ప్రేమ, పెళ్లి పేరిట నమ్మించి లైంగికంగా వేధించాడని డైరీ లో రాసుకుంది. వేధింపులు తీవ్రం కావడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నోట్ రాసింది. ఆ తర్మాత ప్రమాదకరమైన మత్తు ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. 12 రోజులుగా మృత్యువుతో పోరాడి నేడు మరణించింది.