కేరళ అధికార పార్టీ లెప్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న సీఎం పినరయి విజయన్ కుమార్తె టి.వీణను విచారించుకునేందుకు దర్యాప్తు సంస్థకు కేంద్రం అనుమతించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమాల్లో వీణ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కంపెనీల చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదైంది.
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కోర్టులో టి.వీణపై ఛార్జ్ షీట్ సమర్పించారు. దీని విచారణకు కేంద్రం తాజాగా అనుమతి మంజూరు చేసింది.