పాలస్తీనా, సిరియాలపై ఇజ్రాయెల్, అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. బుధ,గురువారం జరిపిన దాడుల్లో 64 మంది చనిపోయారు. గాజా నాసర్ ఆసుపత్రి సమీపంలోనూ దాడులు జరిగాయని పాలస్తీనా ప్రకటించింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
సిరియాలో హూతీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులకు దిగింది. యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై యూఎస్ఏ సైన్యం నిర్వహించిన వైమానికదాడుల్లో ఆరుగురు హూతీ ఉగ్రవాదులు హతమయ్యారు.
బుధవారంనాడు ఇజ్రాయెల్ సైన్యం సిరియాలోని ఐదు నగరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో హమా సైనిక విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైంది. పదుల సంఖ్యలో సాధారణ పౌరులు, సైనికులు చనిపోయినట్లు సిరియా సైన్యాధికారులు ప్రకటించారు.