తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వానలు పడనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవనున్నాయి. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులూ వీయొచ్చని అంచనా వేసింది.
కర్నూలు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల పరిధిలో అక్కడక్కడా భారీ వర్షం పడే అవకాశముంది. ఆదివారం నుంచి ఎండ తీవ్రత పెరిగే అవకాశముంది.
తెలంగాణలోనూ నేడు, రేపు వానలు పడనున్నాయి.తెలంగాణలో గురువారం రాత్రి ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం తెల్లవారే వరకు పడింది. హైదరాబాద్‌లో దాదాపు అన్ని డివిజన్లలో కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. పిడుగుపాట్లు, గోడకూలిన ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.