రాజ్యసభ్యలో వక్ఫ్ సవరణ బిల్లు చర్చకు వచ్చిన సందర్భంలో బీజేడీ కీలక నిర్ణయం తీసుకుంది. మనసాక్షి ప్రకారం ఎంపీలు ఓటు వేయవచ్చు అని తెలిపింది.
తొలుత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ రాజ్యసభ వేదికగా బుధవారం నాడు, బిజు జనతాదళ్ తెలిపిది. అయితే గురువారం నాడు మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.సభ్యులు ఇష్టానుసారం తమ ఓటు వేయవచ్చు అని విప్ జారీ చేయట్లేదని తెలిపింది. మైనార్టీల బావోద్వేగాలను గౌరవిస్తామని ప్రకటించిన 24 గంటల తర్వాత ఈ నిర్ణయంతీసుకోవడంపై రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బీజేడీ కి లోక్ సభలోప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలో ఆ పార్టీ నుంచి ఏడుగురు ఉన్నారు. వారంతా వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తారని తొలుత ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే 24 గంటల వ్యవధిలోనే వెనక్కి తగ్గింది.
వైసీపీ స్టాండ్ ఇదీ…
వక్ఫ్ (సవరణ) బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని వైసీపీ రాజ్యసభలో పేర్కొంది. చర్చ సందర్భంగా మాట్లాడిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉందన్నారు. ఏపీలో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారని లెక్కలు చెప్పిన వైవీ సుబ్బారెడ్డి. .. వారి ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
వక్ఫ్ బిల్లు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని మైనార్టీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం అన్నారు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల