వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ముస్లిములు అందరూ చదివి తెలుసుకోవాలని ఇండియన్ సూఫీ ఫౌండేషన్ అధ్యక్షుడు కషిష్ వార్సీ అన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్సభ ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును ఆయన స్వాగతించారు.
లోక్సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సమయంలో ఇండీ కూటమిలోని సభ్యులైన పార్టీలన్నీ ఆ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాయి. బీజేపీ, దాని మిత్రపక్షాలు మాత్రం ఈ బిల్లు వక్ఫ్ బోర్డుల పనితీరును మరింత మెరుగు పరుస్తుందని, పారదర్శకతను తీసుకొస్తుందనీ బలంగా సమర్ధించుకున్నాయి.
వక్ఫ్ బిల్లుపై ప్రభుత్వ వర్గాల వివరణను కషిష్ వార్సీ స్వాగతించారు. ‘‘బిల్లులో ముస్లిముల పట్ల ఎలాంటి దురుద్దేశమూ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. నిజానికి ఈ చట్టం పేద ముస్లిముల జీవితాలలోకి కానుకను తీసుకొస్తుంది’’ అని కషిష్ అన్నారు.
‘‘పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినందుకు ప్రభుత్వానికి అభినందనలు. హోంమంత్రి ప్రసంగం ద్వారా వక్ఫ్ బిల్లు వల్ల ముస్లిములకు ఏ హానీ లేదని స్పష్టమైంది. ఈ బిల్లును పూర్తిగా చదవాలని దేశంలోని ముస్లిములు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని పార్టీలు అదేపనిగా ఒకే పని చేసాయి. అవి బీజేపీని బూచిగా చూపించి భయపెట్టాయి. కానీ ఇప్పుడు ముస్లిములకు అసలైన స్నేహితులెవరో, శత్రువులెవరో తేలిపోయింది. వక్ఫ్ బిల్లు పేద ముస్లిములకు కానుకనిస్తుంది’’ అని కషిష్ వార్సీ చెప్పుకొచ్చారు.
వక్ఫ్ బిల్లు మీద లోక్సభలో 12గంటలకు పైగా సుదీర్ఘ సమయం పాటు చర్చ జరిగింది. తర్వాత ఓటింగ్ జరిగింది. అందులో బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు వచ్చాయి, బిల్లుకు వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లు 1995 నాటి వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడానికి ఉద్దేశించినది. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిపాలనను మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. గతంలో ఉన్న చట్టంలోని లోటుపాట్లను అధిగమించడం, వక్ఫ్ బోర్డుల సమర్ధతను పెంపొందించడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడం, వక్ఫ్ రికార్డుల నిర్వహణలో టెక్నాలజీ పాత్రను పెంచడం ఈ బిల్లు ఉద్దేశాలు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల