వక్ఫ్ బోర్డు అధికారాలకు కత్తెర వేసేస్తున్నారు, అది ఇస్లాం మతానికే ద్రోహం అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేస్తున్నాయి. అయితే, ఏ ఇస్లామిక్ దేశంలోనూ లేని ఈ వక్ఫ్ బోర్డు భారతదేశంలో మాత్రమే ఉంది. దానికి ఇన్ని అధికారాలు ఎలా వచ్చాయి?
భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ముస్లిం మతపరమైన, ధార్మికమైన అవసరాలను నిర్వహించడం కోసమే. దశాబ్దాలుగా ఆ బోర్డు అధికారాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అయితే 2013లో యూపీయే హయాంలో ఆ అధికారాలు అసాధారణంగా పెరిగిపోయాయి. వక్ఫ్ ఆస్తుల హక్కుల పరిధిని అనూహ్యంగా పెంచేసిన సందర్భం అది.
స్వతంత్ర భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసం మొదటిసారిగా వక్ఫ్ చట్టానికి 1954లో రూపకల్పన చేసారు. దానికి 1995లో సవరణలు చేసారు. ఆ సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తుల వ్యవహారాలను చూసుకోడానికి వక్ఫ్ బోర్డుకు స్వయంప్రతిపత్తి ఇచ్చారు. అయితే, బోర్డు అధికారాల్లో నాటకీయమైన మార్పులు తీసుకొచ్చిన సవరణలు మాత్రం 2013లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసినవే.
2013లో అప్పటి యూపీయే ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో భారీ స్థాయి మార్పులే చేసింది. ఆ సవరణలు వక్ఫ్ బోర్డు అధికారాలను అపరిమితంగా పెంచేసాయి. ఎటువంటి పత్రాల ఆధారమూ లేకుండా ఏదైనా ఆస్తిని వక్ఫ్ సొంత ఆస్తి అని ప్రకటించేసుకునే ఏకపక్ష అధికారాన్ని వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టింది అప్పుడే. అంతే కాదు, వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాల్లో సివిల్ కోర్టుల జ్యూరిస్‌డిక్షన్‌ను కుదించేసింది కూడా 2013లోనే. దాని ప్రకారం… వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలను సాధారణ న్యాయస్థానాల్లో కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వక్ఫ్ ట్రిబ్యునళ్ళలో మాత్రమే విచారించాలి.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గద్దె దిగిపోవడానికి ముందు చేసిన ఈ సవరణల పరిణామాలు చాలా దారుణంగా తేలాయి. సరైన రికార్డులు లేని పాత కాలపు గుడులు, సత్రాలు, మఠాలు, ఆఖరికి రక్షణ శాఖ ఆస్తుల మీద కూడా వక్ఫ్ బోర్డు ఆకుపచ్చ గుడ్డ కప్పేయడం మొదలుపెట్టింది. ఫలితంగా ఎన్నో వర్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. చట్టపరమైన పోరాటాలు ఏళ్ళ తరబడి సాగుతూనే ఉన్నాయి.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జనగ్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు : వైఎస్ షర్మిల