ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు -2025కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్‌ను (APDC) ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (APSFL) నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు సమ్మతి తెలిపింది.
రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఇక నుంచి ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి జిల్లా పరిధిలోని డీఎల్‌పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం తెలిపింది. బార్ లైసెన్స్‌ల ఫీజును రూ.25లక్షలకు కుదించింది.
జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయాలని కేబినెట్ నిర్ణయించింది.