మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘెల్ పాత్ర ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ స్కామ్ విచారణలో భాగంగా భాఘెల్ పాత్రపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణం లబ్ధిదారుల లో బాఘెల్ కూడా ఉన్నారని ఎఫ్ఐఆర్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది.
నేరపూరిత కుట్ర, మోసం, ఛత్తీస్గఢ్ జూద నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. మొత్తం 19 మంది పాత్ర ఉన్నట్లు సీబీఐ విచారణలో తేలింది. తనపై నిరాధార ఆరోపణలు చేసిందన్న బాఘెల్, రాజకీయ కుట్రతోనే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు.