ప్రవీణ్ మరణం విషయంలో రాష్ట్రప్రభుత్వం చేస్తున్న దర్యాప్తు మీద తమకు పూర్తి నమ్మకముందని పాస్టర్ ప్రవీణ్ భార్య జెసికా అన్నారు. ప్రభుత్వంతో పాటు తమకు అండగా నిలుస్తున్న క్రైస్తవులకు ధన్యవాదాలు చెబుతూ ఆమె వీడియో సందేశం విడుదల చేసారు. ఆ ఘటనను అడ్డు పెట్టుకుని మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దని ఆమె కోరారు.
ప్రవీణ్ సోదరుడు కిరణ్ కూడా ఈ విషయంలో స్పందించారు. కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహంతో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారనీ, దానివల్ల ప్రవీణ్ ఇమేజ్ దెబ్బతింటోందనీ ఆవేదన వ్యక్తం చేసారు. కొందరు యూట్యూబర్లు, బ్లాగర్లు అసత్య ప్రచారం చేస్తున్నారనీ, మరికొందరు ఈ వ్యవహారాన్ని రాజకీయంగా, మతపరంగా వాడుకుంటున్నారనీ చెప్పారు. ప్రవీణ్ మీద గౌరవంతో అలాంటి చర్యలను ఆపివేయాలని విజ్ఞప్తి చేసారు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల