ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధి లో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ భాగస్వామిగా మారనుంది. కూటమి ప్రభుత్వ ఆహ్వానం మేరకు బుధవారం రాష్ట్రానికి వచ్చిన సింగపూర్ ప్రతినిధులు, నేడు సీఎం చంద్రబాబు,మంత్రి లోకేశ్‌ను కలిసి పలు విషయాలపై చర్చించనున్నారు.
2014 లో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వైసీపీ హయాంలో ఈ ఒప్పందం రద్దు అయింది. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రావడంతో పాటు అమరావతి అభివృ ద్ధికి పూర్వ ప్రాధాన్యం దక్కడంతో మళ్ళీ సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి అభివృద్ధిలో భాగం అయ్యేందుకు సుముఖత చూపుతోంది.
అమరావతి నిర్మాణంలో అసెండాస్-సింగ్ బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ సంస్థల కన్సార్షియాన్ని స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎంపిక చేసింది. సింగపూర్ కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థ కలిసి ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది ప్రతిపాదించింది. కృష్ణానది, కరకట్టకు మధ్య 170 ఎకరాలు కేటాయించగా అక్కడ శాశ్వత నిర్మాణాలకు వీల్లేకపోవడంతో మరోచోట స్థలం కావాలని ఏడీపీ కోరింది. వైపీసీ హయాంలో ఆ చర్చలు కొలిక్కి రాలేదు.
అమరావతిలో స్టార్టప్ ప్రాజెక్టు ఎంతో కీలకంగా ఉండటంతో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో వాణిజ్య, నివాస, వినోద, పర్యాటక వసతులను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఆ ప్రాజెక్టు ద్వారా 2.50 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు దొరకడంతో పాటు రాష్ట్ర జీఎస్‌డీపీకి రూ.1.15 లక్షల కోట్లు జమ అవుతాయి. పన్నుల రూపంలో రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం లభించనుంది.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల