భారతదేశంపై 26శాతం పరస్పర సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మోదీ గొప్ప స్నేహితుడే అయినప్పటికీ వ్యాపారం వ్యాపారమేనని ట్రంప్ స్పష్టం చేసారు.
అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తుల మీదా కనీసం 10శాతం పరస్పర సుంకాలు విధిస్తున్నామని వెల్లడించారు. ఇతర దేశాలు తమ దేశం మీద విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నామని ట్రంప్ అన్నారు. భారత్ తమపై 52శాతం సుంకాలు విధిస్తోందనీ, తాము మాత్రం భారత్‌పై 26శాతం మాత్రమే సుంకాలు విధిస్తున్నామనీ స్పష్టం చేసారు. ఈ చర్యల వల్ల అమెరికాకు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.