ఐపీఎల్-2025 లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. బెంగళూరు చినస్వామి స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ 170 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి సాధించింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లివింగ్స్టన్ (54), జితేశ్ శర్మ (33), టిమ్ డేవిడ్ (32) రాణించారు. విరాట్ కోహ్లీ (7) , విల్ జాక్స్ 14, దేవదత్ పడిక్కల్ (4) నిరాశపరిచారు. కెప్టెన్ రజత్ పటిదార్ (12) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
గుజరాత్ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు తీయగా , సాయికిశోర్ రెండు, ప్రసిద్ధ్‌కృష్ణ, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశారు.
గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ (49), జాస్ బట్లర్ ( 73) రాణించడంతో 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. శుభమన్ గిల్ 14 బంతుల్లో 14 పరుగులు చేసి ఔట్ కాగా రూథర్ ఫర్డ్ 18 బంతుల్లో 30 పరుగులు చేశాడు.
ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్ తలో వికెట్ పడగొట్టారు.