టీటీడీ సమీక్షలో సీఎం చంద్రబాబు
తిరుమల ప్రతిష్ఠ మరింత పెరిగేలా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల తిరుపతి
దేవస్థానం పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు …ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ జరిగిన సంస్కరణలపై వివరణకోరారు.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా చర్చించారు.
బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం సమీక్షించారు. శ్రీవారి లడ్డు, అన్నప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై అధికారులు సీఎంకు వివరించారు.
గ్యాలరీల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యా లు మాడవీధుల్లో ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు. అలిపిరిలో బేస్ క్యాంప్ నిర్మాణం, పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలో శ్రీవారి ఆలయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. .
ఆంధ్రప్రదేశ్ వెలుపల నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతి గురించి ఆరా తీశారు. భక్తులకు సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.