ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆ జట్టు 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటంగ్ చేసిన లక్నో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పూరన్ 30 బంతుల్లో 44 పరుగులు చేయగా బదోని (41), సమద్ (27) ఫరవాలేదు అనిపించారు.
పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. మ్యాక్స్‌వెల్, ఫెర్గూసన్, యాన్సెన్, చహల్‌లు తలా ఒక వికెట్ తీశారు.
లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్, 34 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్( 52), నేహల్ వధేరా( 42) పరుగులతో రాణించడంతో పంజాబ్ 16.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
నేడు బెంగళూరు వేదికగా ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.