ఏపీ ప్రభుత్వం అందిస్తోన్న వాట్సప్ సేవల ద్వారా 16 వేల మంది రైతులు ధాన్యం అమ్ముకున్నారని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో వెల్లడించారు. రైతులు వారికి సమీపంలోని మిల్లర్లకు ధాన్యం అమ్ముకునేందుకు వాట్సప్ సేవల ద్వారా లబ్దిపొందారని మంత్రి తెలిపారు.
రైతులకు గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.