అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపుపై ఏప్రిల్ 2న తుది నిర్ణయం రానుంది. ఈ తరుణంలో భారత సుంకాలపై ట్రంప్ స్పందించారు. లిబరేషన్ డే డెడ్‌లైన్‌కు ముందే భారత్ సుంకాలు తగ్గించే అవకాశముందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలు తగ్గించాలనే నిర్ణయానికి వచ్చిందని ఆయన వెల్లడించారు.
అమెరికా వస్తువులపై అధిక సుంకాలు వేసిన చాలా దేశాలు ఇప్పుడు తగ్గించుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ ఇప్పటికే 2.5 శాతం తగ్గించుకున్నాయి. భారత్ గణనీయంగా సుంకాలను తగ్గించుకుంటుందని ట్రంప్ చెప్పారు. సుంకాల తగ్గింపు రోజును ఆయన లిబరేషన్ డేగా అభివర్ణించారు.
ఏప్రిల్ 3 నుంచి వాహనాలు, విడిభాగాలపై 25 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు వసూలు చేస్తోందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. వివిధ దేశాల సుంకాల వల్ల అమెరికా వస్తువుల ఎగుమతులు అసాధ్యంగా మారింన్నారు. ప్రతీకార సుంకాలు తప్పదన్నారు.
భారత్‌కు అమెరికా ఎగుమతి చేసే వస్తు సేవలపై సగటున 7.7 శాతం టారిఫ్ ఉండగా, అమెరికాకు భారత ఎగుమతులపై 2.8 శాతం మాత్రమే ఉంది. వీటి మధ్య వ్యత్యాసం 4.9 శాతం. అమెరికా యాంటీ టారిఫ్ విధిస్తే సుంకాలు 4.9 శాతం తగ్గించాల్సి ఉంటుంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉత్పత్తులకు వేరుగా టారిఫ్‌లు విధించాలని గనుక అమెరికా నిర్ణయిస్తే భారత్ నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు 32.4 శాతం, పారిశ్రామిక ఉత్పత్తులకు 3.3 శాతం మేర సుంకాలు పెరిగే అవకాశముంది.