గుజరాత్లో బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. బనస్కంతా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు దాటికి భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
దీసా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కర్మాగారంలో మంగళవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది పేలుడు ధాటికి కర్మాగారం పైకప్పు కూలిపోయింది. పలువురు కార్మికులు చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. పేలుడులో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్మాగారం యజమాని పరారీలో ఉన్నారు.