వాట్సప్ సేవలు ప్రజలకు మరింత చేరవ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వాట్సప్ ద్వారా 300 సేవలు అందిస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు వాట్సప్ ద్వారా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 12 నుంచి 15 తేదీల మధ్యలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఏప్రిల్ 6 కల్లా ఇంటర్మీడియట్ పేపర్ల మూల్యాంకనం పూర్తి కానుంది. ఆ తరవాత విద్యార్ధులకు షార్ట్ మెమోలు వాట్సప్‌కు వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థుల మార్కుల వివరాల పీడీఎఫ్ మెమోలు వారికి ఉపయోగపడనున్నాయి.