టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన ఖరారైంది. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు వెళ్ళనుంది. అక్టోబర్ 19 నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 23తో ముగియనుంది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు ఐదు టీ20లను నిర్వహించనున్నారు. మూడు వన్డేలు డే అండ్ నైట్ మ్యాచ్‌లు కాగా టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు రాత్రే నిర్వహించనున్నారు.
అక్టోబరు 19న పెర్త్ వేదికగా తొలి వన్డే జరగనుంది. రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ లో జరగనుంది. ఇక మూడో వన్డే
అక్టోబరు 25న సిడ్నీలో జరగనుంది.
అక్టోబరు 29- తొలి టీ20 (కాన్‌బెరా)
అక్టోబరు 31- రెండో టీ20 (మెల్‌బోర్న్)
నవంబరు 2- మూడో టీ20 (హోబర్ట్)
నవంబరు 6- నాలుగో టీ20 (గోల్డ్‌కోస్ట్)
నవంబరు 8- అయిదో టీ20 (బ్రిస్బేన్)
భారత మహిళల జట్టు కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. 2026 ఫిబ్రవరి-మార్చిలో భారత్, ఆసీస్‌తో 3 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్ట్ ఆడనుంది. ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్య టీ20 సిరీస్ జరగాల్సి ఉండగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు వన్డే సిరీస్ జరుగనుంది. పెర్త్‌లోని వాకా మైదానంలో మార్చి 6 నుంచి ఏకైక టెస్టు ప్రారంభం కానుంది.