శ్రీరామ నవమికి అయోధ్య ముస్తాబైంది. రామమందిరం విద్యుత్ దీపాల అలంకరణలో సుందరంగా దర్శనమిస్తోంది.
రామాలయాన్ని రకరకాల పూలతో అలంకరించారు.
బాలరాముడికి ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం దిద్దనున్నారు. సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదుటిపై పడేలా ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకను తిలకించేందుకు రామజన్మ భూమి క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
నవమి వేడుకల సందర్భంగా ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు అభిషేకం, ఉదయం 10.40 గంటల నుంచి 11.45గంటల మధ్య ఆరాధన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హారతి అనంతరం సూర్య తిలకం కార్యక్రమం ఉంటుంది.