ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్( 37), సంజు శాంసన్( 20) పరుగులు చేశారు.
చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీశ పథిరన తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
లక్ష్యఛేదనలో చెన్నై పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ రచిన్ రవీంద్ర వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్( 63) , రవీంద్ర జడేజా( 32), రాహుల్ త్రిపాఠి( 23) పోరాడినా విజయం దక్కలేదు.
రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో హసరంగా నాలుగు వికెట్లు తీయగా, సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
నేడు కోల్‌కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.