IPL-2025లో భాగంగా విశాఖపట్టణం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలవగా క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. అభిషేక్( 1), ఇషాన్( 2), నితీశ్( 0) విఫలమయ్యారు.
అభినవ్ మనోహర్(4), పాట్ కమిన్స్ (2), వియాన్ ముల్డర్ (9), హర్షల్ పాటిల్ ( 5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
దిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు.
లక్ష్యఛేదనలో దిల్లీ అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్(38), ఫాఫ్ డుప్లెసిస్ (50) రాణించారు. అభిషేక్ పొరెల్ 18 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా ట్రిస్టన్ స్టబ్స్ 14 బంతుల్లో 21 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 5 బంతుల్లో 15 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు .
ఎస్ఆర్హెచ్ బౌలర్ జషీన్ అన్సారీకి మూడు వికెట్లు దక్కాయి.