దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 12 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఏప్రిల్ 7న మహా పట్టాభిషేకానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ రోజు సాయంత్రం స్వామివారికి ఆరాధన నిర్వహించిన అనంతరం స్వర్ణ కల్పవృక్ష వాహనం సేవ ఉంటుంది. రాములవారి తిరువీధి సేవ, పుట్టమన్ను పూజ ఉంటుంది.
కళ్యాణ బ్రహోత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన ఈవో రమాదేవి, రూ. 2.50 కోట్లతో భక్తుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
200 క్వింటాళ్ళ బియ్యంతో తలంబ్రాలు తయారు చేసి 60 కౌంటర్ల ద్వారా భక్తులకు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.