ఐపీఎల్ -2025లో భాగంగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
ఓపెనర్ సాయి సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగులు చేయగా కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (38), జోస్ బట్లర్( 39) పరుగులు చేశారు. షెర్ఫాన్ రూథర్ ఫర్డ్( 18) తనదైన ఇన్నింగ్స్ తో జట్టు భారీ స్కోర్ కు సహాయపడ్డాడు.
ముంబయి బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్ , దీపక్ చహర్ , ముజీబ్ ఉర్ రెహ్మాన్, సత్యనారాయణ రాజు తలా ఒక వికెట్ తీశారు.
గుజరాత్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 160 రన్స్ మాత్రమే చేయగల్గింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో గుజరాత్ ఖాతా తెరిచింది.
సూర్యకుమార్ యాదవ్ (48), తిలక్ వర్మ( 39) మాత్రమే రాణించగా మిగతావారు విఫలమయ్యారు. రోహిత్ శర్మ( 8), కెప్టెన్ హార్దిక్ పాండ్యా( 11) అభిమానులను నిరాశపరిచారు.
గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
నేడు విశాఖ వేదికగా దిల్లీ కేపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.