విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఉగాది పచ్చడిని స్వీకరించిన అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. ప్రముఖపండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాంగ శ్రవణం చేయగా సభికులు ఆసక్తిగా విన్నారు.