ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో తీవ్ర విషాదం నెలకొంది. బంగారం వ్యాపారం నిర్వహించే కృష్ణాచారి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. గాంధీ బజారులో మూడు దశాబ్దాలుగా బంగారం వ్యాపారం చేస్తోన్న కృష్ణాచారి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటం జిల్లా అంతటా తీవ్ర కలకలం రేపింది. కృష్ణాచారి భార్య సరళమ్మ, కుమారులు సంతోష్, భువనేష్ చనిపోయి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.