ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు దీటుగా మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళా నిర్వహించాలని మహారాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళాగా నామకరణం చేయనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, నాసిక్‌లో పర్యటించిన , 2027లో జరగబోయే కుంభమేళాకు సన్నాహాలు ఊపందుకున్నాయి. త్రయంబకేశ్వర్ అఖాఢాల ప్రతినిధులు ఈ ఉత్సవానికి త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో నాసిక్ కుంభమేళాగానే కొనసాగించాలని కోరారు. కుంభమేళా నిర్వహణకు 500 ఎకరాలకు పైగా భూమిని శాశ్వతంగా కేటాయించాలని అఖాడా నేతలు డిమాండ్ చేశారు.
నాసిక్ జిల్లా మేజిస్ట్రేట్ జలజ్ శర్మ మాట్లాడుతూ నాసిక్ కుంభమేళాకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. సాధువులు, మహంతుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహారాష్ట్ర జలవనరులు, విపత్తు నిర్వహణ మంత్రి గిరీష్ మహాజన్ అన్నారు. త్రయంబకేశ్వర్‌ను సందర్శన అనంతరం ఈ ప్రకటన చేశారు.
ఇటీవల ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో జరిగిన కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళా జరిగింది.