తిరుమల శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు ఐఏఎస్, ఐపీఎస్, స్థానిక అధికారుల సిఫార్సు లేఖల దర్శనాలను నిలిపివేశారు. ఇప్పటికే విఐపి బ్రేక్ ద్వారా 4 వేల మంది, దాతలు, వర్చువల్ ఎస్ఈడీ 5 వేలు, శ్రీవాణి 1500 మంది ఇలా రోజుకు 12 వేల మంది వరకూ దర్శనాలు అవుతున్నాయి. వీరి దర్శనానికే ఆరు గంటల సమయం పడుతోంది. ఈ సమయంలో సాధారణ భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నారు. దీంతో సాధారణ భక్తుల దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
సామాన్య భక్తుల దర్శన సమయాన్ని 8 గంటలకు తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు కూడా పూర్తి అయితే తిరుమలకు రోజుకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయించింది. సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని నిర్ణయించారు.