ఆర్జీ కర్ ఘటన : సామూహిక అత్యాచారం జరగలేదు… సీబీఐఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనపై కోల్‌కతా హైకోర్టుకు సీబీఐ కీలక నివేదిక సమర్పించింది. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని తేల్చి చెప్పింది. సీబీఐ తరపు న్యాయవాది రాజ్‌దీప్ మజుందార్ ఘటనా స్థలంలో సేకరించిన డీఎన్‌ఏ నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలు జరిపినట్లు కోర్టుకు తెలిపారు. 14 మంది వైద్యుల బృందం పరీక్ష ఫలితాలను విశ్లేషించిందన్నారు.ఫోరెన్సిక్ నివేదిక పరీశీలన అనంతరం సామూహిక అత్యాచారం జరగలేదని తేల్చిచెప్పారు.
నేరస్థుడు సంజయ్ రాయ్ ప్రమేయం మాత్రమే ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సాక్ష్యాలు నాశనం చేశారనే దానిపై ఇంకా విచారణ సాగుతోందని సీబీఐ అధికారులు తెలిపారు.
బాధిత కుటుంబానికి తొలిగా సమాచారం అందించిన ఆసుపత్రి అసిస్టెంటును సీబీఐ విచారించలేదని వైద్యురాలి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనను సీబీఐ ఖండించింది. ఇప్పటి వరకు విచారించిన వ్యక్తుల జాబితాను ఇవ్వాలని కోర్టు ఆదేవించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.