దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసుల బలగాలు, మావోయిస్టుల మధ్య శనివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లాలోని గోగుండా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
గోగుండ కొండ ప్రాంతంలో మావోయిస్టుల సంచారంపై పోలీసులకు నిఘా వర్గాల అందడంతో సైనిక బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి.ఈ క్రమంలో కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారని అధికారులు ప్రకటించారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.