ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించింది. 705 మంది సభ్యులతో పదవులు భర్తీ చేసింది. ఛైర్మన్లు, అభ్యర్థుల ఎంపిక కోసం నెల రోజులుగా ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు. తాజాగా ప్రకటించిన 47 పదవుల్లో 37 తెలుగుదేశం, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలో మరో లిస్ట్ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.