నిధులు దుర్వినియోగం చేశారంటూ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2019లో ద్వారకలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగుల వ్యవహారంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ ఓ వ్యక్తి రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మాజీ సీఎం కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపుతున్నామని, మరికొంత సమయం ఇవ్వాలంటూ పోలీసుల తరపు న్యాయవాదులు కోరారు. దీంతో తదుపరి కేసు విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేశారు.