అమరావతి వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో 39 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇవాళ 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండి తెలిపింది.
మొబైల్ ఫోన్లకు వాతావరణ హెచ్చరిక పంపిస్తున్నారు. మొబైల్ ఫోన్లలో అలారం మాదిరి మోగేలా ఏర్పాట్లు చేశారు. హెచ్చరిక వచ్చిన తరవాత మొబైల్లో బటన్ నొక్కితేనే అది ఆగిపోనుంది. ఎండలో బయట తిరగవద్దని అధికారులు సూచించారు. తప్పనిసరిగా ఎండలో వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండ, వడగాలుల నుంచి రక్షణకు ఓఆర్ఎస్, మజ్జిగ, మంచినీరు,కొబ్బరినీరు తాగాలని సూచించారు.