తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. బెయిల్ కోసం వంశీ పెట్టుకున్న పిటిషన్‌ను సిఐడి కోర్టు కొట్టివేసింది.వంశీ సహా మరో నలుగురు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను సిఐడి కోర్టు కొట్టివేసింది.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి విషయంల ఫిర్యాదు చేసిన సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీపై అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు విదేశాలకు పారిపోయే ప్రమాదముందని సిఐడి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదముందని వాదనలు వినిపించారు.