ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజీనామా హెచ్చరికలు జారీ చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న తిరువూరు ఏఎంసీ ఛైర్మన్ రమేశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేదంటే 72 గంటల్లో రాజీనామా చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. పార్టీ అధిష్ఠానం రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తనకు ఈ ఎమ్మెల్యే పదవి అవసరం లేదన్నారు.
రమేశ్ రెడ్డి గిరిజన మహిళను లైంగికంగా వేధించాడంటూ వందలాది మహిళలు ఎమ్మెల్యే కొలికపూడిని చుట్టుముట్టారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ తిరువూరు టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వారితో మాట్లాడిన కొలికపూడి రమేశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, లేదంటే తానే రాజీనామా చేస్తానంటూ హెచ్చరించారు. #tdpmlakolikapud