పాకిస్థాన్ జైలులో భారత మత్స్యకారుడు బలవర్మరణానికి పాల్పడ్డాడు. పాకిస్థాన్ కరాచీలోని మరాలీ జైలులో గౌరవ్ రామ్ ఆనంద్ అనే భారత మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూంలో తాడుతో ఆత్మహత్య చేసుకున్నట్లు పాకిస్థాన్ జైలు అధికారులు వెల్లడించారు. న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరకు మృతదేహాన్ని శీతల గదిలో ఉంచుతామని ప్రకటించారు. అంతర్జాతీయ జల సరిహద్దు సరిగా గుర్తించలేని మత్య్సకారులు పాక్ జలాల్లోకి ప్రవేశించడంతో వారిని అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారు.
పాక్, భారత్ మధ్య ఖైదీల అప్పగింతకు జవనరి 1న ఒప్పందం జరిగింది. భారత్‌కు చెందిన 299 మంది మత్స్యకారులు పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. పాకిస్థాన్‌కు చెందిన 435 మంది భారత జైళ్లలో ఉన్నారు. ఇటీవల 22 మందిని పాక్ విడుదల చేసింది. అరెస్టైన మత్స్యకారులు ఖైదు పూర్తి కావడంతో వారిని భారత్‌కు అప్పగించారు.